Sep 24,2023 15:28
  • 50 పైగా కొత్త ఇంజనీరింగ్ ఆవిష్కరణలు ప్రదర్శన.
  • మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా నినాదంతో ముందుకు

ప్రజాశక్తి-రామచంద్రపురం : ప్రధానమంత్రి పిలుపుమేరకు మేడ్ ఇన్ ఇండియా మేక్. ఇన్ ఇండియా నినాదంతో ఆధునిక సైన్స్ పరిశోధనలు ఆవిష్కరణలతో ముందుకు వెళుతున్నామని రామచంద్రపురంలోని రాజరత్న కిట్స్ కళాశాల డైరెక్టర్ ఎం పవన్ కుమార్ తెలిపారు. రెండు రోజులపాటు కళాశాలలో జాతీయస్థాయి నూతన ఇంజనీరింగ్ ఆవిష్కరణలు ప్రదర్శనలపై జరిగిన ఎగ్జిబిషన్ ఆదివారంతో ముగిసింది. ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ గమంత్ర అనే పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ కు 50 పైగా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నూతన ఆవిష్కరణలు ప్రదర్శించారని ఆయన వివరించారు. ఈ సందర్భంగా పరిశోధకులకు ప్రశంస పత్రాలను జ్ఞాపికలను అందజేశారు. కళాశాల ప్రిన్సిపల్ బర్ల వెంకట్ మాట్లాడుతూ సైన్స్ పరిశోధనలో ప్రధమ స్థానం ద్వితీయ స్థానం తృతీయ స్థానం కాన్పో లేషన్ బహుమతులను ప్రకటించమని వీటిని అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున హైదరాబాదులో ఏర్పాటు చేసే కార్యక్రమంలో ప్రముఖుల చేతుల మీదుగా బహుమతి ప్రధానం చేస్తామని వివరించారు. డైరెక్టర్లు రామారావు, రవీందర్, శ్రీకాంత్, లు ప్రసంగించి పరిశోధకులను అభినందించారు మరింత నూతన ఆవిష్కరణలతో దేశానికి ,ప్రజలకు ఉపయోగపడే విధంగా కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా కాకినాడ జేఎన్టీయూ వైస్ ఛాన్స్లర్ నుండి ప్రశంస పత్రాలను పరిశోధకులకు అందజేశారు. వీరితో పాటుగా కిట్స్ కాలేజీ ఇంజనీరింగ్ విద్యార్థులు రూపొందించిన ఆధునిక సైన్స్ పరికరాలను ప్రదర్శించారు. వీరందరిని కళాశాల అధ్యాపకులు డైరెక్టర్లు అభినందించారు. త్వరలో దేశ ప్రధాని ఆధునిక ఇంజనీరింగ్ పరిశోధకులు కలవనున్నారని ఈ సందర్భంగా వారు పత్రికలకు తెలియజేశారు.