
న్యూఢిల్లీ : పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి విధించిన రేండేళ్ల జైలుశిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించడంపై కాంగ్రెస్ స్పందించింది. దీంతో రాహుల్ ఎంపి హోదా పునరుద్ధరణకు అవకాశం ఏర్పడనుంది. సత్యమేవ జయతే అని ట్విటర్‌లో పేర్కొంది. ''ఈ విజయం ద్వేషంపై ప్రేమ సాధించిన విజయం. సత్యమేవ జయతే.. జై హింద్'' అని ట్వీట్ చేసింది. ఈ రోజు చాలా సంతోషకరమైన రోజని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు. ఈ అంశంపై ఈ రోజే లోక్‌సభ స్పీకర్‌కి లేఖ రాసి, మాట్లాడతానని అన్నారు.