Nov 17,2023 14:32

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో విడుదలైంది. 2023, నవంబర్‌ 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే.. నవంబర్‌ ఈ రోజు పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. హైదరాబాద్‌ గాంధీ భవన్‌ లో నిర్వహించిన మేనిఫెస్టో రిలీజ్‌ కార్యక్రమంలో పాల్గన్న ఖర్గే.. 'అభయ హస్తం' పేరుతో 42 పేజీల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇప్పటికే ఆరు గ్యారంటీలు, బీసీ డిక్లరేషన్‌, మైనార్టీ డిక్లరేషన్‌ లను కాంగ్రెస్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.

  • మ్యానిఫెస్టోలోని ముఖ్యాంశాలివే

- ఏకకాలంలో రూ.2లక్షల పంట రుణమాఫీ
- రూ.3లక్షల వరకు వడ్డీలేని పంట రుణాలు
- వ్యవసాయానికి 24గంటల నిరంతర ఉచిత విద్యుత్‌
- ధరణి స్థానంలో భూమాతా లేదా భూభారతి పోర్టల్‌-ప్రతి రైతుకు భూ ఆధార్‌కార్డు ఇస్తాం
- ప్రతి ఏటా జాబ్‌ క్యాలెండర్‌- సకాలంలో నోటిఫికేషన్లు
-సీపీఎస్‌ రద్దు - పాత పెన్షన్‌ స్కీమ్‌ అమలు
- అసంఘటిత కార్మికుల కోసం కార్పొరేషన్‌
- బీసీలకు 12 కార్పొరేషన్లుతోపాటు వైశ్యులకు సైతం కార్పొరేషన్‌
- ఎంబీసీలకు ప్రత్యేక కార్పొరేషన్‌
- అభయహస్తం పునరుద్ధరణ
- విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్‌ సౌకర్యం
- పోడు భూములకు పట్టాలు
- వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణం, పెన్షన్‌ రూ.6వేలు
- జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, మెట్రోలో ఉచిత ప్రయాణం, మీడియా కమిషన్‌ ఏర్పాటు
- ఆరోగ్య శ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు%ౌౌ% దాని పరిధిలోకి మోకాలి సర్జరీ
- ఆర్‌ఎంపీ, పీఎంపీలకు గుర్తింపు కార్డులు
- ప్రయివేటు విద్యాలయాల్లో భోధన, భోధనేతరులకు ఉద్యోగ భద్రత కోసం ప్రత్యేక జీవో జారీ
- కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ
- గ్రామ పంచాయతీలకు చెరువుల నిర్వహణ, మరమ్మతుల బాధ్యతలు. అందుకోసం తగినన్ని నిధులు
- మెగా డీఎస్సీ ప్రకటించి.. ఆరు నెలల్లో టీచర్‌ పోస్టుల భర్తీ
- బడ్జెట్‌లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయింపు
- మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు నెలకు రూ.10వేల వేతనం
- మూతబడిన దాదాపు 6వేల పాఠశాలలను పున్ణప్రారంభిస్తాం
- కొత్తగా నాలుగు ట్రిపుల్‌ ఐటీలు ఏర్పాటు చేస్తాం
- ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికీకరించి మెరుగైన వైద్యం అందిస్తాం
- భూహక్కుల సమస్యల పరిష్కారానికి ల్యాండ్‌ కమిషన్‌ ఏర్పాటు
- సర్పంచ్‌ల ఖాతాల్లో గ్రామ పంచాయతీ అభివద్ధి నిధులు జమ
- గామ పంచాయతీ వార్డు మెంబర్లకు నెలకు రూ.1,500 గౌరవ వేతనం
- ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్‌ డీఏలు చెల్లిస్తాం
- కొత్త పీఆర్సీ ఏర్పాటు చేసి.. ఆరు నెలల్లో అమలు చేస్తాం
- ఇప్పటికే ఆరు గ్యారంటీలతోపాటు రైతు, మహిళా, మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ల హామీ