
హైదరాబాద్ : ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాంధీ భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేశారు. ముందుగా ప్రకటించిన ఆరు గ్యారంటీలతోపాటు 36 అంశాలను మేనిఫెస్టోలో చేర్చారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, తదితరులు పాల్గొన్నారు.