May 05,2023 14:44
  • అత్యున్నత ప్రమాణాలతో విశిష్ట గుర్తింపు
  • వివరాలు వెల్లడించిన చైర్మన్ రఘు కలిదిండి

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : రఘు ఇంజనీరింగ్ కళాశాలకు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన నాక్ ఏ ప్లస్ గ్రేడ్ గుర్తింపు లభించినట్లు విద్యాసంస్థల చైర్మన్ కలిదిండి రఘు తెలిపారు. గత నెలలో కళాశాలను సందర్శించిన నాక్ నిపుణుల బృందం రెండు రోజులపాటు కళాశాలలో మౌళిక వసతులు, మానవ వనరులు, ప్రయోగశాలలు వంటివి ప్రత్యక్షంగా పరిశీలించి అత్యుత్తమ ర్యాంకును అందించాయన్నారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు కళాశాలకు చేరాయని రఘు విద్యా సంస్థల చైర్మర్ కలిదిండి రఘు తెలిపారు. శుక్రవారం ఉదయం మేఘాలయ హెూటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇప్పటికే రఘు ఇంజీనరింగ్ కళాశాల అటానమస్ గుర్తింపు, ఎన్ బీఏ గుర్తింపును సైతం కలిగి ఉన్నాయని, ప్రస్తుతం నాక్ ఏ ప్లస్ గుర్తింపుతో కళాశాల ప్రమాణాలు అత్యుత్తమంగా ఉన్నట్లు స్పష్టమయ్యాయన్నారు. నాక్ 4.0 స్కేల్ పై తమ కళాశాలకు 3.35 మార్కులను పొంది, ఏ ప్లస్ గ్రేడిని సాధించిందన్నారు. కళాశాలలో అభివృద్ధి చేసిన అడ్వాన్స్డ్ లేబరేటరీ, ఎలక్ట్రోలాంజ్, ఇన్నోవేషన్ స్టూడియో, బిఎస్ఎన్ఎస్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఇంక్యుబేషన్ సెంటర్, అడ్వాన్స్డ్ మానుఫాక్చరింగ్ ఫెసిలిటీ, అడ్వాన్స్డ్ కోడింగ్ ఫెసిలిటి వంటివి నాక్ నిపుణుల బృందం ప్రత్యక్షంగా పరిశీలించి ప్రశంసించడం జరిగిందన్నారు. నాక్ నిపుణులు కరికులం, టీచింగ్-లెర్నింగ్, రీసెర్చ్-ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్-లెర్నింగ్ రిసోర్సెస్, స్టూడెంట్ సపోర్ట్ ప్రోగ్రామ్స్, గవర్నెన్స్-లీడర్షిప్, ఇనిస్టిట్యూషన్ వేల్యూస్-బెస్ట్ ప్రాక్టీసెస్ అనే ఏడు అంశాలపై క్షున్నంగా పరిశీలన జరిపి ఈ గుర్తింపును అందించిందన్నారు. కంప్యూటర్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాలలోని నాలుగు రీసెర్చ్ సెంటర్లు జెఎన్ టీ యూ గుర్తింపును సైతం కలిగి ఉన్నాయి. అత్యున్నత ప్రమాణాలతో విలువలతో కూడిన విద్యను అందిస్తూ, నూతన విద్యా విధానంలో సూచించిన విధంగా దేశానికి విలువైన మానవ వనరులుగా యువతను తీర్చిదిద్దే దిశగా రఘు విద్యా సంస్థలు. పనిచేస్తున్నాయన్నారు. అత్యుత్తత నిపుణులైన బోధన సిబ్బంది, అంతర్జాతీయ ప్రమాణాలతో మౌళిక వసతులు, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పనచేస్తూ పనిచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.హెచ్ శ్రీనివాసు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ. విజయ్ కుమార్, ఐక్యూఏసి సమన్వయకర్త డాక్టర్ పి. శశి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.