Dec 17,2020 11:54

కృష్ణా (విజయవాడ సిటీ) : 104 సిబ్బంది సమస్యను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. విజయవాడ ధర్నా చౌక్‌లో చేపట్టిన రెండో రోజు దీక్షలను గురువారం సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ముజఫర్‌ అహ్మద్‌ ప్రారంభించి మాట్లాడారు. కరోనా సమయంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అయిన 104 సిబ్బంది సమస్యల్ని సిఎం జగన్‌ విస్మరించడం తగదన్నారు. 104 సిబ్బంది కొత్త డిమాండ్స్‌ అడగడం లేదని, సిఎం ఇచ్చిన హామీని అమలు చేయమని అడుతున్నారని తెలిపారు. వీరి సమస్యపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. తక్షణమే 104 సిబ్బందిని వైద్య ఆరోగ్య శాఖలోకి తీసుకోవాలని, పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.