May 13,2023 12:52

ప్రజాశక్తి-రామచంద్రపురం (అంబేద్కర్‌ కోనసీమ) : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు చేయాలని, జీతాలు చెల్లించాలని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి అని 104 వాహనాల ముందు శనివారం ఉద్యోగులు నిరసన తెలిపారు. 104 ఉద్యోగులు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ... తాళ్లపోలం 104 వాహనాల ముందు డిమాండ్లతో కూడిన ఫ్లకార్డ్‌లతో నిరసన తెలియచేశారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి 31/10/2019 న ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పి.ఎఫ్‌ చెల్లింపులను సక్రమంగా చెల్లించాలని, 104 వాహన సేవలను గతంలో వలె రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డిఏఓ పలివెల చంద్ర శేఖర్‌ మాట్లడుతూ ... గత 5 రోజులుగా తమ సమస్యలపై పలు రకాలు గా నిరసన కార్యక్రమాలు చేస్తున్నా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదు అని , రాబోయే రోజుల్లో కూడ ఉద్యమం ద్వారా పలు రకాల నిరసన కార్యక్రమాలు చేపడతామని వివరించారు. ఈ కార్యక్రమంలో పలివెల చంద్ర శేఖర్‌, ఫైలట్‌ కె.శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శి నూకల. బలరామ్‌ కార్మికులకు మద్దతు తెలిపారు.