నెర్రెలిచ్చిన భూములను నాగళ్ళతో దున్ని
పసిడిపంటలను పండించే అపరభగీరథుడు
పుడమితల్లికి ముద్దుల పుత్రుడు అన్నదాత
పుట్టెడుగింజల కోసం కాలంతో పోరాటం చేస్తూ
చినుకుల కోసం ఆతృతగా ఎదురు చూస్తుంటాడు
కడివెడు చినుకులే రైతన్నకు ఆపన్నహస్తాలు
పంటకోసం ఆరుగాలం పరిశ్రమించి, కష్టపడుతూ
చేతికొచ్చేదాకా నిరంతరం కాపలాకాస్తుంటాడు
పచ్చని పంటలే రైతన్నకు భరోసానిచ్చే కల్పతరువు
చెరువుల్లో నిండుకున్న నీళ్ళను చూసినప్పుడల్లా
అన్నదాత కళ్లల్లో ఊటబావిలా ఊరే కన్నీళ్లు
ఎండిపోయిన విత్తులతో ఆవిరవుతున్న ఆశలు
సెమటచుక్కలను ఇంధనంగా పెడుతున్నప్పుడల్లా
అవనితల్లికి శ్రమసౌందర్యాన్ని కానుకగా ఇస్తుంటాడు
శ్రమయేవ జయతే అంటూ కష్టపడే కష్టజీవి రైతన్న
* డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, 9032844017