విజయవాడ: నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం (నరసం) 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని శ్రీ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆగస్టు 12వ తేదీన శతాధిక కవయిత్రుల సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఆ సంఘం గౌరవాధ్యక్షురాలు శ్రీమతి తేళ్ళ అరుణ తెలియజేశారు. విజయవాడలోని కఅష్ణా జిల్లా రచయితల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యక్రమ వివరాలతో కూడిన పోస్టర్, కరపత్రాన్ని శుక్రవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శతాధిక కవి సమ్మేళనానికి 'వనితావనం - కవితా సౌరభం' అని నామకరణం చేశామన్నారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్, విశిష్ట అతిథులుగా ప్రముఖ కవయిత్రి డాక్టర్ వాడ్రేవు వీరలక్ష్మీదేవి, ప్రముఖ స్త్రీవాద రచయిత్రి శ్రీమతి కుప్పిలి పద్మ, గౌరవ అతిథులుగా కఅష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు శ్రీ గుత్తికొండ సుబ్బారావు, రచయిత్రుల సంఘం అధ్యక్షురాలు చిన్న లక్ష్మి కళావతి, ప్రధాన కార్యదర్శి పాతూరి అన్నపూర్ణ, ఆత్మీయ అతిథులుగా డాక్టర్ జీవీ పూర్ణచందు, డాక్టర్ బూసురుపల్లి వెంకటేశ్వర్లు, డాక్టర్ నూనె అంకమ్మరావు, హాజరవుతారని తెలిపారు. ప్రముఖ మహిళా కవయిత్రులైన డాక్టర్ కొలకలూరి ఆశాజ్యోతి, శ్రీమతి మందరపు హైమవతి, డాక్టర్ ఎస్.మస్తానమ్మ, శ్రీమతి కె.సుబ్బలక్ష్మమ్మ, శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మిను పురస్కారాలతో సన్మానించనున్నట్లు శ్రీమతి అరుణ తెలిపారు.130 మందికి పైగా కవయిత్రులు పాల్గంటున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆమె కోరారు. కార్యక్రమంలో 'స్త్రీ నిరుక్తము' పుస్తక ఆవిష్కరణ జరుగుతుందని తెలిపారు. పుస్తకాన్ని తరపట్ల సత్యనారాయణ సమీక్ష చేస్తారు. ఈ సమావేశంలో కఅష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు , ప్రధాన కార్యదర్శి శ్రీ జి.వి.పూర్ణచంద్ , రచయిత్రుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి, నరసం రాష్ట్ర కోశాధికారి బీరం అరుణ, ఎన్ టి ఆర్ జిల్లా నరసం కన్వీనర్ శ్రీమతి జోస్యభట్ల స్వాతి, నరసం రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీమతి సామినేని శైలజ , కృష్ణా జిల్లా కన్వీనర్ శ్రీమతి కరెడ్ల సుశీల, కరెట్ల శ్రీదుర్గ, నందనవనం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.