ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో 30 వేలమంది మహిళలు మాయమయ్యారని, అందుకు వలంటీర్లే కారణమని కేంద్ర ఇంటెలిజెన్స్ చెప్పినట్లు చేసిన వ్యాఖ్యలపై పది రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌కు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ సోమవారం నోటీసులు జారీ చేశారు. మహిళల భద్రతపై భీతిగొలిపే విధంగానూ, ఒంటరి మహిళల గౌరవానికి భంగం కలిగించే విధంగానూ ఆ వ్యాఖ్యలు ఉన్నాయని మహిళా కమిషన్ నోటీసులో పేర్కొంది. 'ఎంతమంది ఒంటరి మహిళలను వలంటీర్లు సంఘ విద్రోహశక్తులకు అప్పగించారని కేంద్రం మీకు చెప్పింది? ఇందుకు సంబంధించిన ఆధారాలు మీకు చూపారా? లేక నిరాధార ఆరోపణలతో మహిళలను భయభ్రాంతులకు గురిచేసే మాటలతో రాజకీయం చేసేందుకు మాట్లాడారా?' అనిప్రశిుంచింది. 'మీరు వ్యాఖ్యానించిన విధంగా మహిళల అదృశ్య లెక్కలు, ఆధారాలను 10 రోజుల్లోగా మహిళా కమిషన్‌కు మీరు కానీ, మీ ప్రతినిధి ద్వారా కానీ తెలియజేయాలి' అని పేర్కొంది.