చెమట చుక్కలు
ఆవిరవుతున్నాయి
రైతుల దీన స్థితులను చూసి
మట్టి రేణువులు
విప్లవిస్తున్నాయి
రైతుల ఉద్యమాలని చూసి
హలాలన్ని
చర్నాకోలవుతున్నాయి
రైతుల వేదనలను చూసి
పొలాలన్ని
ఎడారులవుతున్నాయి
రైతుల కన్నీళ్ళను చూసి
విత్తులన్ని
విస్తుపోతున్నాయి
రైతుల పస్తులను చూసి
అన్నపూర్ణమ్మ
అల్లాడుతోంది
రైతు బిడ్డల ఆక్రందనలు చూసి
గద్దెల మీదున్న
పెద్దలు ఇకనైనా చలించకపోతే
మరో కురుక్షేత్రం జరగక తప్పదు.
* కయ్యూరు బాలసుబ్రమణ్యం, సెల్: 770802 77240