Nov 09,2022 16:08

ప్రజాశక్తి - రెడ్డిగూడెం : మైలవరం - విస్సన్నపేట ఆర్ అండ్ బి రహదారి రోజురోజుకు అధ్వానంగా తయారై పోతుంది. గత మూడు సంవత్సరాలుగా ఈ రహదారి ఇలాగే ఉంటూ అనేక ప్రమాదాలకు నిలయంగా మారింది. ముఖ్యంగా విస్సన్నపేట రెడ్డిగూడెం మధ్య ప్రయాణం చేయాలంటే వాహనదారులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవాల్సిందే. ఈ రెండు మండలాల మధ్య ఉన్న ఆర్ అండ్ బి రహదారిపైన భారీ ఎత్తున లారీలు తిరుగుతూ ఉండట వనల భయంకరమైన గోతులమయంగా తయారయ్యి రాకపోకలకు అంతరాయం కలగటమే కాకుండా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రహదారి నిర్మాణం కొరకు నిదులు మంజూరై ఉన్నప్పటికీ ఎందుకు ఆలస్యం జరుగుతుందో అర్థం కావటం లేదంటూ ప్రజలు వాపోతున్నారు వర్షాకాలం వెళ్లిపోయింది కాబట్టి ఇకనైనా ఈ రహదారికి మరమ్మత్తులు చేపడుతారేమో వేచి చూడాల్సిందే