ప్రజాశక్తి -అమలాపురం రూరల్ :అమలాపురం రూరల్ మండలం రెడ్డిపల్లి లో రూ. 20 లక్షలు తో నిర్మిస్తున్న నూతన రోడ్లు కు శుక్రవారం సర్పంచ్ కరాటం ప్రసన్న ప్రవీణ్ అద్వర్యంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్.పి.పి కుడుపూడి భాగ్యలక్ష్మి,జడ్పీ. టి.సి పందిరి శ్రీహరి తదితరులు కొబ్బరికాయ కొట్టి భూమిపూజ చేశారు.అలాగే రూ.1.8 కోట్ల తో నిర్మించిన నూతన తారు రోడ్డు ను పరిశీలించి సంతఅప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కట్టా సత్తిబాబు, సెంట్రల్ డెల్టా చైర్మన్ కుడుపూడి బాబు,ఎంపీటీసీ సత్తి భాగ్యలక్ష్మి, వార్డు సభ్యులు రేలంగి శ్రీను,రేలంగి దుర్గాప్రసాద్ (నాని),మాజీ సర్పంచ్ షేక్ అమీర్,ఫీల్డ్ అసిస్టెంట్ ఆర్.జ్యోతి,ఇంజినీర్ అసిస్టెంట్ గుత్తుల పార్ధు,కాంట్రాక్టర్ బుజ్జి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.