కైరో : ఈజిప్టులో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం 35 మంది మృతి చెందారు, 50 మందికి పైగా గాయాలపాలయ్యారని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. శనివారం ఉదయం వాడి అల్ - నట్రూన్ సమీపంలోని కైరో- అలెగ్జాండ్రియా హైవేపై బస్సు, కార్లు, లారీ ఒకదానికొకటి వరుసగా ఢకొీన్నాయి. ఈ ప్రమాదంలో లారీ బోల్తాపడింది. మంటలు చెలరేగి బస్సు, మిన్సీ బస్సు, అనేక కార్లు ధ్వంసమయ్యాయి. ఈ మంటల్లో 18 మంది కాలిబూడిదైపోయినట్లు అల్- అహ్రమ్ న్యూస్ వెబ్‌సైట్ పేర్కొంది. ప్రమాదం జరిగిన చోట దట్టమైన పొగ కమ్ముకుందని.. ప్రజలు గుంపులు గుంపులుగా చేరారని మీడియా పేర్కొంది. ఇక ఈజిప్టులో రోడ్డు ప్రమాదాల్లో వేలాది మంది మృతి చెందుతారు. 2021లో రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 7 వేల మంది మృతి చెందినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.