బాచుపల్లి (హైదరాబాద్) : హైదరాబాద్ బాచుపల్లిలోని రోడ్డుపై గుంతలు చిన్నారిని బలి తీసుకున్నాయి. బాచుపల్లికి చెందిన చిన్నారి రెండో తరగతి చదువుతోంది. తండ్రితో కలిసి బైక్‌పై వెళుతుండగా, బాచుపల్లి రెడ్డీస్ ల్యాబ్ సమీపంలో రోడ్డుపై గుంతలతో బైక్ ఇరుక్కుపోయింది. దీంతో పాప బైక్‌పై నుండి ఎగిరిపడి రోడ్డుపై పడిపోయింది. ఇంతలోనే వెనుకనుండి వచ్చిన స్కూల్ బస్సు చిన్నారి పై నుండి దూసుకెళ్లింది. దీంతో పాప అక్కడికక్కడే చనిపోయింది.