Oct 04,2023 12:11

ప్రజాశక్తి-నందిగామ : నందిగామ డివిజన్ పరిధిలోని పని సర్దుబాటు పేరుతో ఉపాధ్యాయులను దూర ప్రాంతాలకు  వేసిన డెప్యూటేషన్ లను పరిశీలించి సరిచేయాలనీ పిఆర్టియు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నవాబ్ జానీ,సోలా రాఘవ రాజు డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో డిప్యూటీ ఉప విద్యాశాఖ అధికారి  వెంకటసుబ్బయ్య , వివిధ ఉపాధ్యాయ సంఘం నాయకులు, మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవాబ్ జానీ రాఘవ రాజు పలుఅంశాలను ఉప విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకుని వెళ్లారు. పని సర్దుబాటులో భాగంగా ఉపాధ్యాయులను సుదూర ప్రాంతాలకు సర్దుబాటు చేయటమైనదని తెలిపారు. దూర ప్రాంతాల్లో నియమించిన ఉపాధ్యాయులకు దగ్గరగా అదే మండలంలో పని సర్దుబాటు చేయాలని కోరారు. డిమాండ్లను పరిశీలించి వర్క్ అడ్జస్ట్మెంట్ వివరాలను సరిచేయాలని నవాబ్ జాని,రాఘవ రాజు డిమాండ్ చేశారు.