ప్రజాశక్తి-చందర్లపాడు : మండలంలోని పోక్కునూరు గ్రామంలో సుమారు 138 మంది రైతులు గత సంవత్సరం అకాల వర్షాలకు ప్రత్తి ,మిరప నీటమునిగి పంట పూర్తిగా దెబ్బతిన్నది. ప్రభుత్వం ఉచిత పంటల బీమాను వర్తింపజేసి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని మండల కేంద్రమైన చందర్లపాడులో స్థానిక బస్టాండ్ సెంటర్లో కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి చనమోలు సైదులు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అన్న మాట పూర్తిగా వ్యతిరేకంగా ఉందని రైతుల పట్ల వివక్ష చూపుతో వారిని చిన్న చూపు చూస్తుందని పూర్తిస్థాయిలో పంటల బీమాను వర్తింప చేయడంలో ప్రభుత్వం పూర్తిగావిఫలమైందని అన్నారు. పోక్కునూరులో సూమారు 138 మందికి రైతులకు పంటల భీమా డబ్బులు పడలేదని అన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. నష్టపరిహారం ఇవ్వకపోతే రైతులు రోడ్లెక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి వేల్పుల ఏసోబు,ఎస్.కె కాశీం రైతు, కౌలు రైతులు నల్ల మేకల సదాశివరావు, మర్రి వెంకటేశ్వర్లు, మర్రి లక్ష్మణరావు, జెట్టి గంగయ్య, పెరుగు వెంకటేశ్వరరావు, నల్లమేకల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.










