ప్రజాశక్తి-చందర్లపాడు : మండల కేంద్రమైన చందర్లపాడులోని స్థానిక సిఐటియు భవన్లో సిఐటియూ మండల కార్యదర్శి వేల్పుల ఏసోబు అద్యక్షతన శుక్రవారం సాయంత్రం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా సిఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.సిహెచ్ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ అంగన్వాడి, ఆశా,మధ్యాహ్న భోజనం, పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కరించాలని పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి అన్ని రంగాల్లో ఉన్న కార్మికులు చైతన్యం కావాలని పిలుపునిచ్చారు.చందర్లపాడు మండలంలో పంచాయితీలలో పనిచేసే గ్రీన్అంబాసిడర్లను ఇప్పటికే పనిలో నుండి తొలగించడం జరిగిందని వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలని, ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు పనులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఇసుక ప్రభుత్వం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, సిమెంటు, ఐరన్ ధరలు తగ్గించాలని, భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని అన్నారు.ఈ డిమాండ్ల పరిష్కారం కై అక్టోబర్ 3 తేదీన జరిగే ధర్నాలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు, సిపిఎం పార్టీ నాయకులు కె గోపాల్, సిఐటియు మండల కార్యదర్శి వేల్పుల ఏసోబు, సిఐటియు మండల అధ్యక్షులు ఇ.కమల, బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు డి వెంకటేశ్వరరావు, ఆటో కార్మికులు ఎం సంజయ్ ,స్కూలు స్వపర్స్ జి లక్ష్మి, ఈ ప్రభావతి, మధ్యాహ్న భోజన కార్మికురాలు స్వరూప, గ్రీన్ అంబాసిడర్ కర్ల లక్ష్మయ్య, కె.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.










