ప్రజాశక్తి-చందర్లపాడు : మండలంలోని తోటరావులపాడు గ్రామ సర్పంచ్ ములకలపల్లి లక్ష్మి ఆధ్వర్యంలో కౌలు రైతుల సంఘం 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ తోటరావులపాడు గ్రామంలో జరిగినది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే కాలంలో రైతాంగ సమస్యలపై మరింత సమర్థవంతంగా పోరాడుతూ కౌలు రైతుల సంఘం అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ నాయకులు ములకలపల్లి కృష్ణమోహన్, కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు, రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం వెంకటరెడ్డి, పీవీ ఆంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సయ్యద్ కాసిం, నీటి సంఘం నాయకులు యక్కండి సత్యనారాయణ రెడ్డి, రైతులు పుచ్చకాయల శ్రీనివాసరావు పొద్దుటూరు మౌలేశ్వరావు, ములకలపల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










