Sep 22,2023 12:33

ప్రజాశక్తి-రామచంద్రపురం : ద్రాక్షారామ రామచంద్రపురం రోడ్ లో ఏర్పడిన పెద్దపెద్ద గోతులను పూడ్చాలని, ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని నియోజకవర్గ బిసి సేన అధ్యక్షులు యాట్ల నాగేశ్వరరావు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ద్రాక్షారామం వద్ద రెండు అడుగుల లోతుల్లో ఉన్న గోతుల్లో ఆయన నిలబడి గోతులు పూడ్చండి ప్రాణాలు కాపాడండి అంటూ ప్ల కార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోడ్డు పడే ఐదేళ్లయిన స్థానిక నాయకులు మంత్రులు ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడంలేదని పలు అమాయకులు ఈ గోతుల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నారని. పలువురు అంగవైకల్యం పాలయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై గ్రీవెన్స్ లో ఆర్డీవోకు అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని ఆయన  ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి ఈ రోడ్డును ఆధునికరించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు.