ప్రజాశక్తి-బుట్టాయిగూడెం : జంగారెడ్డిగూడెం ఫారెస్ట్ రేంజర్ కడలి శ్రీవాణిపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం ఆధ్వర్యంలో బుట్టాయగూడెం ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా నుద్దేశించి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ... 2021 వ సంవత్సరంలో లక్ష్మడుగూడెం పంచాయతీ బూసరాజుపల్లి గ్రామానికి చెందిన తొమ్మిది గిరిజన కుటుంబాలకి ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. గిరిజనులు తమకు ఇచ్చిన పట్టా భూముల్లోకి వ్యవసాయలు సాగు చేయకుండా జంగారెడ్డిగూడెం రేంజరు శ్రీవాణి అడ్డుపడుతుంది అన్నారు. ఈ భూముల పైకి వ్యవసాయం చేయడానికి వస్తే మీపై కేసులు నమోదు చేస్తామని గిరిజనులను భయబ్రాంతులకు గురి చేసే విధంగా శ్రీవాణి వ్యవహారం ఉందని అన్నారు. దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఆర్డీవో, ఐటిడిఏ (పిఓ) అధికారులకు ఫిర్యాదు చేసిన ఆవిడ ద్వారానే మారలేదని అన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే శ్రీ వాణిపై తీసుకోవాలి. గిరిజనులకు ఇచ్చిన ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టా భూముల్లో సాగు చేయకుండా అడ్డుపడుతున్న శ్రీవాణిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘంగా డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పటికే శ్రీవాణిపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయటం జరిగిందని వారు వేధింపులు ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పోలోజి నాగేశ్వరావు, గిరిజనులు మడకం, శారద, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు తామ ముత్యాలమ్మ, సిఐటియు నాయకులు నాగమణి బుల్లెమ్మ ఉన్నారు.










