Dec 08,2022 13:26

ప్రజాశక్తి - కశింకోట : విశాఖ ఉమ్మడి జిల్లా అనకాపల్లి తాలూకు ఎపి యన్ జి ఓ ఈ నెల ఆఖరు జరుగు ఎన్నికల ఓట్ల కల్పించాలని డిమాండ్ చేస్తూ కశింకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు హెల్త్ సిబ్బంది నిరసన గురువారం వ్యక్తంచేశారు ఈ సందర్భంగా ఎమ్ పి హెచ్ ఓ సి హెచ్ సత్యనారాయణ మాట్లాడుతూ పాత పాలకవర్గం వారుకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను ఎపి యన్ జి ఓ యూనియన్ ఓటరుగా నమోదు చేస్తున్నారని ఆరోపించారు. అందరి ఉద్యోగులు ఓటు హక్కు కల్పించాలని ఇప్పుడు జరుగుతున్న ఓటు హక్కు అందరికీ కల్పించాలని రాష్ట్ర ఎపి యన్ జి ఓ అధ్యక్షుడు బిందు శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అనకాపల్లి తాలూకు ఎన్నికల జోక్యం చేసుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు.