ప్రజాశక్తి-టి.నరసాపురం : సాగులో ఉన్న భూములకు పట్టాలు ఇవ్వాలి ఆదివాసులు, పేదలు, దళితులు పై అక్రమ కేసులు ఎత్తివేయాలని ప్రజా సంఘాల కార్యాలయం వద్ద ముఖ్య కార్యకర్తలు సమావేశంలో పిలుపునివ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా శిక్షణ తరగతులు 27, 28 తేదీల్లో టీ నర్సాపురం గ్రామంలో జరుగుతున్నాయి. జిల్లా శిక్షణ తరగతులకు జిల్లా వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు 100 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. జిల్లా శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని కోరారు.










