ప్రజాశక్తి-జీలుగుమిల్లి : మండలంలోని నిర్వాసిత పునరావాస కాలనీలకు స్మశాన వాటిక స్థలాలు తక్షణమే కేటాయించాలని సిపిఎం బృందం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జీలుగుమిల్లి మండలంలోని సిరివాక, కోరుటూరు, గాజులగొంది, టేకూరు, కొత్తమామిడిగొంది, వాడపల్లి, ఎర్రవరం పునరావాస కాలనీల్లో సిపిఎం బృందం పర్యటించింది. ఈ పర్యటనుద్దేశించి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ రవి మాట్లాడుతూ పోలవరం నిర్వాశితులకు భూమికి భూమి సరిహద్దులతో కేటాయించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.కోరుటూరు, టేకూరు నిర్వశితులకు పట్టాలిచ్చినా భూములను వారికీ ఇవ్వకపోవడంతో వ్యవసాయం చేసేందుకు భూములు లేవన్నారు. కొన్నిచోట్ల వివాదాలున్న భూములే అధికంగా నిర్వాశితులకు ఇచ్చారని తెలిపారు. నిర్వశితులకు భూమిని ఎప్పటికి ఇస్తారో తెలియని అయోమయం పరిస్థితిలో నిర్వాశితులు ఉన్నారని అన్నారు. భూమికి భూమి ఇవ్వాలని లేని పక్షంలో అమరావతి రైతులకు ఇచ్చినట్లే ఫించను ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూముకి భూమి ఇవ్వాలన్నారు. ఆర్&ఆర్ ప్యాకేజి, చెట్ల పరిహారం 18ఏళ్ల యువత ప్యాకేజి తక్షణమే విడుదల చేయాలన్నారు.నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేయాలనీ లేని పక్షంలో ఆందోళన చెప్పడతామని హెచ్చరించారు.ఈ పర్యటనలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు తెల్లం దుర్గారావు, వై నాగేంద్రరావు,జి వెంకట్రావు,సీతారామయ్య,డి రమేష్, పోలోజు నాగేశ్వరావు, కారం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.










