Jul 13,2023 10:48

ప్రజాశక్తి - కశింకోట : కశింకోట మండలం సుందరయ్య పేట గ్రామంలో ఉన్న విశాఖ డిస్టలిరీ (మధ్యం కంపెనీ) మురుగు నీరు మంచినీటి సరఫరా బోరులో కలుషితం అయ్యింది. గురువారం ఉదయం మంచి నీటి సరఫరా చేశారు. దీంతో గ్రామస్థులు కంపెనీ ముందు ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీలో పనిచేసే కార్మికులను లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. కంపెనీ మేనేజ్మెంట్ ప్రతినిధి గ్రామస్థులతో మాట్లాడుతూ కంపెనీ తాత్కాలికంగా ఈ రోజు నిలుపుదల చేస్తాము అని చెప్పారు. గత ఏడాది ఈ విషయమై మొరపెట్టుకున్నారు. అయిన నేటికీ ఈ సమస్య పరిష్కారం కాలేదు అని గ్రామస్థులు తెలిపారు.