
ప్రజాశక్తి-రాంబిల్లి : ఈరోజు రాంబిల్లి మండల కేంద్రంలో సెంటర్ లో వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాల రాష్ట్రవ్యాప్త పిలుపులో బాగంగా సిపిఎం, సిపిఎం ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటు పరం చెయ్యెద్దు. ప్రభుత్వరంగం, లోన్ సొంత గనులు కేటాయించి నడపాలని ప్లాంట్కు మద్దతుగా రాస్తారోఖో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి జి.దేముడు నాయుడు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ఏపీకి అన్ని విదాల మోసం చెయ్యడమే కాకుండా. ఏపీకే తలమాణికంగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ను ఆధానికో, పోస్కో కంపెనీవారికో కట్ట బెట్టాలని చూస్తుందని మండి పడ్డారు. వేలాది మందికి ఉపాది కల్పిస్తూ గాజువాక ప్రాంతానికి అత్యధిక తలసరి ఆదాయం కల్పించిన స్టీల్ ప్లాంట్ ను దేశభక్తి ముసుగులో ప్రైవేట్ వ్యక్తులకు కట్ట బెట్టి. బిజెపి కుట్రలను. రాష్ట్ర ప్రజులు, కార్మికవర్గం. ముక్త కంఠంతో ఎదుర్కోని బుద్ది చెప్పాలని విజ్ఞప్తి చేసారు. ఈరోజు. విశాఖ వచ్చిన సిపిఎం జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ కు జరిగిన అన్యాయంపై మాట్లాడకపోగా మోడీ విధానాలును సమర్థిస్తూ స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తున్న కార్మిక నాయకులును, వామపక్ష నాయకులును. పోలీసులుతో అడ్డుకొని, ఆక్రమంగా అరెస్టు చెయ్యడం అన్యాయమన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తే రాబోయే ఎన్నికల్లో బిజెపికి వైసిపికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు. సిహెచ్ పవన్ కుమార్ కె.నూకరత్నం, రాము, సిఐటియు నాయకలు అప్పలరాజు, సత్తెయ్య, బంగార్రాజు, ఎన్.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.