Apr 23,2023 15:06
  • పోర్టు స్టేడియం ముందు నిరసన కార్యక్రమాల్లో అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకుల పిలుపు

ప్రజాశక్తి-విశాఖ : పోర్ట్ స్టేడియం కళ్యాణ మండపాలు ప్రైవేట్ కి ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈరోజు పోర్ట్ స్టేడియం వద్ద పోర్ట్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ పోర్ట్ స్టేడియం కళ్యాణ మండపాలు ఎవరు దయాదాక్షణ్యాల వల్ల వచ్చింది కాదు. పోర్టు కార్మికులు కష్టపడడం వల్ల పోర్టు కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించి స్టేడియం కళ్యాణ మండపాలు వచ్చాయి. కార్మిక చట్టాల్లో భాగంగా ఇటువంటి వెల్ఫేరు మెజర్స్ లో బాగంగా వచ్చాయి.  పోర్టు గాని స్టేడియం గానీ కళ్యాణ్ మండపాలు గాని ఇవన్నీ ప్రజల డబ్బులు. పోర్టు స్టేడియంలో జీవీఎంసీ స్పోర్ట్స్ అకాడమీ వారి షేర్స్ కూడా ఉన్నాయి. ప్రజలు పన్నుల ద్వారా ఏర్పడిన స్టేడియంని ఈ రకంగా ప్రైవేటు వరకు దారాదత్తం చేయడం సరైనది కాదన్నారు. గంటా శ్రీనివాసరావు అనుచరులనురలకు ఇండోర్ స్టేడియంని ఇచ్చారన్నారు. లోకల్ ఎమ్మెల్యేగా ఉంటూ గంట  శ్రీనివాసరావు  ప్రజల పక్షాన ఉంటారా లేదా కాంట్రాక్టర్ పక్షమా? తేల్చుకోవాలని కోరారు. ఈనెల 25న బ్లాక్ బ్యాడ్జీలు పెట్టుకోవాలి, 12గంటల నుంచి 1గంట వరకు నల్ల రిబ్బన్లతో ఎ ఓ బి వద్ద ధర్నా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయుసీ నాయకులు డిసిహెచ్ మసేన్ హెచ్ఎంఎస్ నాయకులు అంజి సిఐటియు నాయకులు బి జగన్ లక్ష్మణరావు ఏంటి శ్రీ నాయకులు జి సందు సి ఎఫ్ టు యు నాయకులు కనకారావు, వాకర్స్ నాయకులు తిలక్ మాట్లాడారు. నాయకులు సత్యనారాయణ, త్రినాథరావు, నరసింగరావు, యల్లరావు, రమణ, బాబు వాకర్స్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.