ప్రజాశక్తి - జీలుగుమిల్లి(ఏలూరు) : మణిపూర్ లో శాంతిని నెలకొల్పాలని యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్, లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఐద్వా ఆధ్వర్యంలో శుక్రవారం భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు, అంబేద్కరిస్టులు, మహిళలు, అందరూ కలిసి మండల కేంద్రంలోని హెచ్.పీ గ్యాస్ సమీపంలోని జాతీయ రహదారి వద్ద నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. తహశీల్దార్ జి సుందర్ సింగ్ కి వినతిపత్రం అందజేశారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న గ్రౌండ్లో సభ నిర్వహించారు. ఈ సభకు యూపీ అధ్యక్షులు సాల్మన్ రాజు లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక అధ్యక్షులు నేలటురి అప్పారావు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. మణిపూర్ ఘటనపై ఒక మతానికి ఒక కులానికి కాకుండా హిందూ, ముస్లిం, క్రైస్తవులు, అంబేద్కర్, వాదులు ఐక్యంగా ర్యాలీ నిర్వహించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మణిపూర్ లో సంఘటన అత్యంత హేమమైనదని వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. భారతదేశంలో రాజ్యాంగ బద్ధంగా మతసామరస్యాన్ని కాపాడాలని పాలకులకు హితువు పలికారు. పాలకుల నిర్లక్ష్యం వల్లే మణుపూర్లో మహిళలకు క్రైస్తవులకు ప్రాణ రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఎవరిని ఎవరు చంపుకుంటున్నారో తెలియని స్థితిలో పాలకులు చెప్పలేకపోవటం సిగ్గు చేటని అన్నారు. మణిపూర్ లో అల్లాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అక్కడ బాధితులకు న్యాయం చేసి రాజ్యాంగ హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ప్రతి ఒక్కరు మతాన్ని గౌరవించాలని మానవత్వాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూపీఏ నాయకులు నిరీక్షణరావు, గిరిజన సంఘం నాయకులు తెల్లం దుర్గారావు ఐద్వా మండల కార్యదర్శి నేలటూరి నిర్మల న్యాయవాది జువ్వల బాపూజీ అంబేద్కర్ యూత్ అధ్యక్షులు తలారి సతీష్ యూపీఏ జనరల్ కమిటీ సభ్యులు అశ్వరావుపేట కామవరపుకోట ఫెలోషిప్ ల పాస్టర్స్ తదితరులు పాల్గొన్నారు.










