Jul 26,2023 10:46

ప్రజాశక్తి-మక్కువ : మణిపూర్ ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని ఆదివాసి జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివాసీ గిరిజన జే ఏ సి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి 8 గంటలకు మక్కువ మండలం, యర్రసామంత వలసలో మనిపూర్ లో ఇద్దరు గిరిజన మహిళలును నగ్నంగా వూరిగించి, అక్యాచారం చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ క్రొవ్వొట్టులతో నిరసన కార్యక్రమము చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజన జే ఏ సి నాయుకులు మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మోయితి తెగకు ఎస్టీ జాబితాలో చేర్చడానికి ఇంఫా ల్ హైకోర్టు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆలోచించాలని ఇచ్చిన తీర్ప ఇచ్చిందని అన్నారు. దీంతో మణిపూర్ లో అగ్నిఆజ్యం పోసినట్లు అయిందని అన్నారు. కుకీ, నాగ తెగలకు అన్య్యాయం జరుగుతుందని కోర్టు తీర్పు వెనక్కి తీసుకోవాలని ఇంఫాల్ లో ఆందోళన చేయగా హింస చెలరేగింది అని 70 మందినీ చంపేశారని అన్నారు. అందులో భాగమే ఇద్దరు గిరిజన మహిళలను తల్లి కూతుర్లును నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసి హత్య చేశారని ఇది దుర్మార్గమని అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో కులతత్వాన్ని, మతతత్వాన్ని రెచ్చగొట్టి మైనార్టీలపై దాడి చేసి చంపి వేస్తున్నారు అని అన్నారు. మణిపూర్ గిరిజన ప్రాంతంలో ఉన్న కొండల్లో ఉన్న ప్లాటినమ్ లాంటి విలువైన గనులను కార్పొరేట్లుకు అప్ప చెప్పడానికి కుల, మత తత్వాలను బిజెపి, ఆర్ ఎస్ ఎస్ లు రెచ్చగొట్టి హింస ను ప్రోతహిస్తున్నారని అన్నారు. కేంద్రలో, రాష్ట్రం లో బిజెపి వుండగానే మణిపూర్ లో హింస ఆగడం లేదంటే అర్దం చేసుకోవాలని ఇప్పటికైనా ప్రజలంతా బిజెపి హింస రాజ కీయాలును ఎండగట్టి, బుద్ది చెప్పాలని, పార్లమెంట్ చర్చ చేసి మణిపూర్ లో హింస ఆపాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు తాదంగి ప్రభాకర్, ఆదివాసీ జే ఏ సి మండల కన్వీనర్ కృష్ణ, పంచాయితీ యూత్ లీడర్ దాసు గిరిజనులు పాల్గొన్నారు.