Jan 30,2023 16:00

ప్రజాశక్తి-టీ నర్సాపురం : మండల కేంద్రంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి జీవో నెంబర్ ఒకటి రద్దు చేయాలని మూతికి నల్ల రిబ్బన్లు కట్టి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శనలు, ర్యాలీలు, సభలు, పెట్టకూడదని జీవో నెంబర్ ఒకటి తీసుకువచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా జీవో నెంబర్ ఒకటి రద్దు ఐక్యవేదికను ఆధ్వర్యంలో అన్ని ప్రజాసంఘాలు అన్ని పార్టీలు నిరసన కార్యక్రమాలు చేపట్టటం జరుగుతుంది. దీంట్లో బాగానే ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వెంటనే జీవో నెంబర్ ఒకటిని రద్దు చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శిలు తుమ్మల సత్యనారాయణ, మడకం సుధారాణి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు అనుములు మురళి తదితరులు పాల్గొన్నారు.