ప్రజాశక్తి-గణపవరం : గర్భిణీ మహిళలు తమ ఆరోగ్య రక్షణ కోసం పోషక విలువలు గల ఆహారాన్ని తీసుకోవాలని గణపవరం ఆరోగ్యం కేంద్రం డాక్టర్ పి సంతోష్ నాయుడు అన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంతోష్ నాయుడు మాట్లాడుతూ 74 మంది గర్భిణీ మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. వీరిలో 18 మందికి ఇబ్బందికరంగా ఉండడంతో వారిని మెరుగైన వైద్యం కొరకు తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. మాతృత్వ అభయ కార్యక్రమం సందర్భంగా స్థానిక లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గర్భిణీ మహిళలందరికీ ప్రొటినిక్సి పౌడర్ పోషక విలువ గల ఆహారం అందరికీ అందించారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ గణపవరం అధ్యక్షులు చవ్వా రవికుమార్. క్లబ్బు మాజీ గవర్నర్ఈపూరి సత్యనారాయణ, క్లబ్ కోఆర్డినేటర్. వెల్లంకి నరేష్ సిఎచ్చ్.ఓ.జే.విల్సన్ బాబు. పిఎచ్..ఎం.వరలక్ష్మి. ఏఎన్ఎంలు ఆశాలు తదితరులు పాల్గొన్నారు.










