ప్రజాశక్తి - ముదినేపల్లి : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాన పోరాడే పత్రిక ప్రజాశక్తి అని ఎంపీపీ రామిశెట్టిసత్యనారాయణ కొనియాడారు.
ముదినేపల్లి మండల పరిషత్తు కార్యాలయంలో శనివారం ప్రజాశక్తి క్యాలెండర్ 2023ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై మంచి కథనాలను ప్రచురితం చేస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారదిలా నిలబడి ప్రజాశక్తి పని చేస్తోందన్నారు.ఈ క్యాలెండర్ మాతో ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజాశక్తి దినపత్రిక మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రజలకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదినేపల్లి గ్రామ సర్పంచ్ నిమ్మగడ్డ కైకమ్మ, ఎంపీడీవో పి మల్లేశ్వరి, దళిత నాయకులు నిమ్మగడ్డ బిక్షాలు, యం.యేసుబాబు, ముదినేపల్లి మండల ప్రజాశక్తి విలేఖరి సేవా సెల్వరాజు పాల్గొన్నారు.










