
ప్రజాశక్తి-తణుకు రూరల్ : పాదయాత్రలో అంగన్వాడీలకు తెలంగాణ కంటే ఒక వెయ్యి ఎక్కువ ఇస్తానన్న జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పీవీ. ప్రతాప్ డిమాండ్ చేశారు. శనివారం అర్ద రాత్రి సమయంలో సిఐటియు నాయకులకు, అంగన్వాడీలకు నోటీసులు ఇచ్చి 25 సోమవారం జరిగే ఛలో విజయవాడను అడ్డుకోవడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తుంది . ఈ సందర్బంగా ప్రతాప్ మాట్లాడుతూ... జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయమంటే నియంతృత్వంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. అంగన్వాడీల సమస్యలు అధికారంలోకి రాగానే వెంటనే పరిష్కారం చేస్తానని వైస్సార్సీపీ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. అప్పుడు అంగన్వాడీల ఓట్లు దండుకోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు వారికి ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. రాష్ట్రం లో వారి వారి హక్కులపై పోరాటం చేస్తున్న వారిపై కేసులు, నిర్భంధం, అరెస్టులు, పోలీస్ లు, నోటీసులు వంటి వాటితో అడ్డుకోవడం నియంతృత్వం చర్యలేనని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి చర్యలు అప్పటి ప్రభుత్వం చేసి ఉంటే ఏ ఉద్యమాలు చేయలేరన్న సంగతి గుర్తించుకోవాలని అన్నారు. ఎన్ని ఆటంకాలు ప్రభుత్వం సృష్టించిన ఛలో విజయవాడ జరుగుతుందని హెచ్చరించారు. ఛలో వెళ్ళేవారిని ఆపడం మానుకొని వారి సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి పద్ధతులు మానుకోక పోతే రానున్న ఎన్నికలలో తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు.