Jan 16,2023 15:40

ప్రజాశక్తి గణపవరం : పండగ సందర్భంగా సాంప్రదాయ కోడిపందాలు పేరుతో గుండాట పేకాట కోడిపందాలు ఆడుతున్న శిబిరాలపై శనివారం రాత్రి గణపవరం పోలీసులు దాడి చేసి తొలగించారు. ఈ సందర్భంగా గణపవరం సిఐ ఎం వి సుభాష్ ఎస్ఐ వి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సరిపల్లి చిన్న రామచంద్రపురం కేశవరం ముగ్గుళ్ళ.మొయ్యేరు  చిలకంపాడు  గ్రామంలో కోడిపందాలు శిబిరాలను తొలగించినట్లు చెప్పారు. లాభాపేక్షతో పేకాట గుండాట నిర్వహీస్తే చట్టంప్రకారం కఠినంగా శిక్షిస్తామని అన్నారు. స్టేషన్ పరిధిలో  ఎనిమిది  కేసులు నమోదు చేసినట్లు చెప్పారు