ప్రజాశక్తి-జంగారెడ్డిగూడెం : పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద పొలవరం ప్రోజెక్ట్ నిర్వాసితులు బైఠాయించారు. వీరికి మద్దతుగా ప్రోజెక్ట్ నిర్వాసితుల సంఘం, గిరిజన సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికసంఘం నాయకులు నిలిచారు. నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని, భూమికి భూమి ఇవ్వాలని, ఇళ్లు కట్టించాలని, 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలనీ నినాదాలు చేసారు.










