Mar 19,2023 16:08

మంచు కురిసిన
పరిసర పసిరికల్లో
ముసుగు వేసుకున్న
ఆమె తెల్లని చేతుల దోసిట్లో
కొన్ని నిన్నటి ప్రేమ బిందువులు
పెదవుల్లో ఉబికి రాని దాటని మాటలు
ఆ వనంలో రెక్కలు విదిలీయని పక్షుల్లా
విరబూయని పువ్వుల్లా చీలిన చిగురుల్లా
నిశ్చలంగా మూలుగుతున్న వృక్షాల్లా
ఒక నిశ్శబ్ద నిరసన గీతాన్ని పాడుటకు
సిద్ధంగా ఉన్నాయి ఆమె అనుమతికై
ఆమె ఇంకా ఈ యుగపు పురుషుడు
మారతాడన్న ఆశతో
రేయింబవలు నృత్యం చేస్తూనే ఉంది
పచ్చని పట్టు వస్త్రాన్ని ధరించి
ఇతను చేసిన గాయలను కప్పెడుతూ
కనిపించనీయక ఒద్దికగా సహనంతో
ఎక్కడో ఓ కూనిరాగం ప్రతిధ్వనిస్తూనే ఉంది
సూర్య కిరణాల లయబద్ధ తాకిడిలో
అపారవశ్య ప్రకృతి పరుపులో...
రఘు వగ్గు
9603245215