ఆకులు రాల్చుతూ శిశిరం
ఆమని వస్తోందని
తొందరపడి నీడనిచ్చే
చెట్ల పత్రాలకు వీడ్కోలిస్తుంది
విగత జీవుల్లా
వల్లకాడు మధ్య ఆగిపోక
రాలిన ప్రతి ఆకూ నడిచి
భూమాతకు ఎరువవుతుంది
పూతా పిందె చిగుళ్ళతో
పచ్చని చెట్లు వర్థిల్లాలని
శిశిరం పండుటాకుల్తో
కలసి పయనమయ్యింది
గూడులోని పక్షి పిల్లలు
చలికి వణుకుతూ
శిశిరానికి వీడ్కోలంటూ
వసంతానికి స్వాగతం పలికాయి
కమనీయ కంఠంతో
కోకిల బుుతు రాజుని
రా రమ్మని ఆహ్వానిస్తే
ఉగాది వచ్చి వాలింది
- పేరూరు బాలసుబ్రమణ్యం
98492 24162