
- ఒకే దేశం, ఒకే విధానం రాష్ట్రాల హక్కులు హరించడమే
ప్రజాశక్తి-హైదరాబాద్ బ్యూరో : సంక్షేమ పథకాలు ఏ మాత్రమూ ఉచితాలు కాదని, ప్రజల హక్కని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఉద్ఘాటించారు. ప్రయివేటీకరణ, సరళీకృత ఆర్థిక విధానాలకువ్యతిరేకంగా ప్రజలందరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కేంద్రం వల్లించే ఒకే దేశం, ఒకే విధానం రాష్ట్రాల హక్కులను హరించడమేనని తెలిపారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 3వ రాష్ట్ర మహాసభ ప్రారంభం సందర్భంగా గురువారం ఖమ్మంలోని ఎస్‌ఆర్ అండ్ బిజిఎన్‌ఆర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజల హక్కుల కోసం ఉద్యమించిన సుందరయ్య, బసవపున్నయ్యలు ఉద్యమించిన గడ్డపై మాట్లాడడం గర్వంగా ఉందని విజయన్ అనాున్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానిు స్మరించుకున్నారు. ముదిగొండ అమరులకు జోహార్లు అర్పించారు. వలసవాద వ్యతిరేక పోరాటాల స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వ పెద్దలు మంటగలుపుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదాన్ని పక్కనబెట్టి... మతవాదాన్ని నెత్తికెత్తుకుంటున్నారని దుయ్యబట్టారు. గాడ్సే, సావర్కర్లను కీర్తిస్తూ మత ఉద్రిక్తతలను రెచ్చగొడుతునాురనివిమర్శించారు. జాతీయవాద నిర్వచనాన్ని హిందుత్వ శక్తులు మార్చేస్తున్నాయన్నారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌కు స్వాతంత్య్ర పోరాటంతో ఎటువంటి సంబంధమూ లేదని తెలిపారు. బ్రిటీష్ వాళ్లకు క్షమాపణలు చెప్పి వారి అడుగులకు మడుగులత్తిన సావర్కార్ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడొద్దని చెప్పారని అన్నారు. జిన్నా కంటే ముందే రెండు దేశాల సిద్ధాంతాన్ని సావర్కర్ ప్రతిపాదించాడని గుర్తు చేశారు. దేశంలో మెజార్టీగా ఉన్న దళిత, ఆదివాసీ, మహిళలు నిరంతరం దాడులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కులం, మతం, జాతి, భాష వైషమ్యాలు సృష్టిస్తూ దేశ ప్రజల మధ్య చిచ్చుపెట్టి శ్రామికుల ఐక్యతను దెబ్బతీసేందుకుకేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు ప్రయతిుస్తున్నారని విమర్శించారు. హిందీ భాషను బలవంతంగా దేశంపై రుద్దడం అందులో భాగమేనన్నారు. తాను హిందీ భాషకు వ్యతిరేకం కాదని, మాతృభాషలను నిర్వీర్యం చేసేలా హిందీని రుద్దడం సహేతుకం కాదని పేర్కొనాురు. జాతి వ్యతిరేకశక్తులను అభ్యుదయ ప్రజాస్వామ్యవాదులు ఎదుర్కోవాలనాురు. ప్రశిుంచే గొంతులను అణచివేస్తూ సంఫ్‌ుపరివార్ శక్తులు దేశంలో స్వైరవిహారం చేస్తునాుయని, మతపరమైన నిరంకుశత్వానిు నిస్సిగ్గుగా దేశంపై బిజెపి రుద్దుతోందనివిమర్శించారు. దేశ సార్వభౌమత్వానిు కాపాడుకునేందుకుప్రజలంతా సంఘటితంగా కదంతొక్కాలనిపిలుపునిచ్చారు. వ్యవసాయం, సహకారం, విద్యుత్తు, శాంతిభద్రతలకుసంబంధించిన వాటిపై రాష్ట్రాలను సంప్రదించకుండా కేంద్రం నిరంకుశంగా చట్టాలు చేస్తోందనాురు. బిజెపియేతర రాష్ట్రాల్లో గవరుర్లను రాజకీయ ఏజెంట్లుగా చేసుకునిరాష్ట్ర ప్రభుత్వాలను బలహీనపర్చేందుకుకుట్ర చేస్తోందనితెలిపారు. మతోన్మాదం ముసుగులో నూతన ఆర్థిక విధానాలను ప్రజలపై రుద్దడంతో కార్పొరేట్లు మరింత ధనికులుగానూ, పేదలు మరింత పేదలుగానూ మారుతునాురనిఅనాురు. వామపక్షాల పోరాటాలతో వచ్చిన ఉపాధి హామీ చట్టానిు మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందనితెలిపారు. దేశంలో 42 శాతం యువత నిరుద్యోగులుగా ఉనాురని, సేవా రంగంలో 80 లక్షలు ఉద్యోగాలకుకోతపడిందనిఅనాురు. సరళీకృత ఆర్థిక విధానాల వల్ల వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని, రైతులు వ్యవసాయాన్ని వదిలేస్తున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా రోజూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బడ్జెట్‌లో రైతుల వాటాను ఐదు శాతం నుంచి మూడు శాతానికి కేంద్ర ప్రభుత్వం తగ్గిందనాురు. పిఎం కిసాన్ స్కీంలో 67 శాతం మంది లబ్ధిదారులకు కోత విధించారని తెలిపారు. నేషనల్ మానిటైజేషన్ పైపులైన్ పథకం పేరుతో ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తున్నారని, శాశ్వత ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారని అన్నారు. దేశంలో ప్రతిపక్ష పాత్రను కాంగ్రెస్ పోషించడం లేదని విజయన్ పేర్కొన్నారు. బిజెపి రిక్రూట్‌మెంట్ ఏజెన్సీగా ఆ పార్టీ పనిచేస్తోందనివిమర్శించారు. సిపిఎం మాత్రమే నిజమైన ప్రతిపక్షమని, దేశ ప్రజల హక్కుల రక్షణకు ప్రజలందరూ సిపిఎంను బలపర్చాలనికోరారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు జి.నాగయ్య అధ్యక్షతన జరిగిన సభలో అఖిల భారత వ్యసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్, సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి వెంకట్రాములు మాట్లాడారు. సభ ప్రారంభలో ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన విప్లవగీతాలు ఆకట్టుకున్నాయి. మహాసభ ప్రారంభం సందర్భంగా ఖమ్మం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.