ప్రజాశక్తి-వేటపాలెం : సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసి, ప్రముఖ ఫార్మసూటికల్ కంపెనీ అయిన హెటిరో డ్రగ్స్ కంపెనీకు 36మంది విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు సోమవారం సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు.సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసి, చీరాల 2007లో స్థాపించబడి ఫార్మసి కౌన్సిల్ ఆఫ్ ఇండియా, వారి గుర్తింపు, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, న్యూఢిల్లి వారి గుర్తింపు మరియు జవహర్లాల్ నెహ్రు టెక్నలాజికల్ యూనివర్సిటీ, కాకినాడ వారి గుర్తింపు పొంది ప్రముఖ ఫార్మసి కళాశాలలో ఒకటిగా గుర్తింపు పొందినట్లు తెలిపారు. కళాశాలలో చదివిన విద్యార్థులలో అధిక శాతం విద్యార్థులు వివిధ బహుళ జాతి సంస్థలలో అత్యుత్తమ వేతనాలతో ఉన్నత ఉద్యోగాలను సాధిస్తున్నారు. గత 5 సంవత్సరం లలో కళాశాల విద్యార్థులు ప్రాంగణ ఎంపికలలో ఎంపికైన విద్యార్థులు వివిధ బహుళ జాతి సంస్థలలో అత్యుత్తమ వేతనాలను పొందుతున్నారు. కళాశాలలో హెటిరో డ్రగ్స్ కంపెని వారు 2023 సంవత్సరం బి. ఫార్మసి మరియు బి.టెక్ పూర్తి కాబోయే విద్యార్థులకు శని మరియు ఆదివారము నాడు నిర్వహించిన ఆఫ్ క్యాంపస్ సెలక్షన్స్లో వివిధ కళాశాలలనుండి 75 మంది విద్యార్థులు హాజరుకాగా అందులో 36 మంది విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల ప్రధాన అధ్యాపకులు డాక్టర్ వి.వి నాగేశ్వర రావు తెలియజేశారు. బి. ఫార్మసి ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 6గురు, యం ఫార్మసి నుండి ఒక్కరు సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజి నుండి 13మంది, బాపట్ల కాలేజ్ ఆఫ్ ఫార్మసి నుండి 13మంది ఇంజినీరింగ్ కళాశాల నుండి ఒక్కరు, డిసిఆర్ యమ్ కళాశాల, ఇంకొల్లు నుండి ఇద్దరు ఎంపికైనట్లు తెలిపారు. ఈ ప్రాంగణ ఎంపికలలో ఎంపికైన ప్రతి విద్యార్థికి రు.2.84లక్షల వార్షిక వేతనము మరియు ఇతర అలవెన్సులు లభిస్తాయని, 2023 సంవత్సరం జూన్ 1న హెటిరో డ్రగ్స్ కంపెనీలో విధులలో చేరవలసి ఉంటుందని, కళాశాల ప్రాంగణ ఎంపికల విభాగ అధికారి యన్ పూర్ణచంద్ర రావు తెలిపారు.










