
న్యూఢిల్లీ : ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌తో కలసి తన వేదికపై కాల పరిమితి జీవిత బీమా ప్లాన్లను ఆవిష్కరించినట్టు ప్రముఖ డిజిటల్ పేమెంట్ల వేదిక ఫోన్‌పే శుక్రవారం ప్రకటించింది. దీని ద్వారా అకాల మరణాలు సంభవించే సమయంలో తమ కుటుంబాలను ఆర్థిక సంక్షోభాల నుంచి రక్షించుకోవచ్చని ఫోన్‌పే పేర్కొంది. ఈ వార్షిక ప్రీమియంలు రూ.149 నుంచే మొదలవుతాయని తెలిపింది. పూర్తిగా డిజిటల్ కస్టమర్ అనుభవం ద్వారా ఎలాంటి వైద్య పరీక్షలు, కాగితపు రాతలు లేకుండానే ఈ పాలసీని తక్షణమే పొందే అవకాశం ఉందని తెలిపింది.