
- ఐసిఐసిఐ బ్యాంకు బ్రాంచి డిప్యూటీ మేనేజర్ చేతివాటం
- రూ.8 కోట్ల నగదు స్వాహా
ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో : తాను పనిచేస్తున్న బ్యాంకునే బురిడీ కొట్టించి కోట్ల రూపాయలను కొల్లగొట్టిన ఘనుడి ఉదంతం ఇది. పోలీసుల కథనం ప్రకారం... వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఐసిఐసిఐ బ్యాంకు బ్రాంచి డిప్యూటీ మేనేజర్‌గా బైరిశెట్టి కార్తీక్... 128 మంది ఖాతాదారులు బంగారు రుణాలు పొందినట్లు రికార్డులు సృష్టించి రూ.8,65,78,000 కొట్టేశారు. ఆడిటింగ్ సమయంలో మోసాన్ని గుర్తించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగళవారం కోర్టులో హాజరుపర్చగా అతన్ని జడ్జి రిమాండ్‌కు పంపారు. ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులూ లేవని పోలీసులు తెలిపారు. సొమ్మును క్రికెట్ బెట్టింగ్‌లో కార్తీక్ పోగొట్టుకున్నట్లు చెప్పారు.