Dec 28,2020 20:40

హైదరాబాద్‌ : ఐసిఐసిఐ ఫ్రుడెన్షియల్‌ లైఫ్‌ వినూత్నమైన రిటైర్‌మెంట్‌ ప్రణాళిక ఐసిఐసిఐ ఫ్రు గ్యారెంటీడ్‌ పెన్షన్‌ ప్రణాళికను ఆవిష్కరించింది. ఇది జీవితాంతం ఆదాయానికి భరోసా అందించడంతో పాటుగా ఆర్ధికంగా స్వేచ్ఛాయుత రిటైర్‌మెంట్‌ జీవితమూను అందిస్తుందని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. నాన్‌లింక్డ్‌, నాన్‌ పార్టిస్పేటింగ్‌ ఇండివిడ్యువల్‌ యాన్యుటీ ఉత్పత్తిగా ఇది వినియోగదారులకు తక్షణ లేదా వాయిదా వేసుకునే అవకాశమూ కల్పిస్తుందని పేర్కొంది. ఒకసారి ప్రీమియం చెల్లించిన వెంటనే వినియోగదారులకు రెగ్యులర్‌ ఆదాయాన్ని అందుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. సింగిల్‌లైఫ్‌ ఆప్షన్‌లో, పాలసీ గ్రహీతలకు జీవితాంతం రెగ్యులర్‌ ఆదాయం చెల్లిస్తారని ఆ సంస్థ పేర్కొంది.