Jul 23,2022 21:24

ముంబయి : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో ప్రయివేటు రంగంలోని ఐసిఐసిఐ బ్యాంక్‌ నికర లాభాలు 50 శాతం పెరిగి రూ.6,905 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.4,616 కోట్ల లాభాలు ఆర్జించింది. క్రితం క్యూ1లో బ్యాంక్‌ నికర వడ్డీపై ఆదాయం 21 శాతం వృద్థితో రూ.13,210 కోట్లుగా ప్రకటించింది. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ1లో రూ.10,936 కోట్ల ఎన్‌ఐఐ నమోదయ్యింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు 3.41 శాతానికి తగ్గాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ ఎన్‌పిఎలు 5.15 శాతంగా నమోదయ్యాయి.