Dec 26,2022 21:24

న్యూఢిల్లీ : ఎల్‌ఐసి హౌజింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (ఎల్‌ఐసిహెచ్‌ఎఫ్‌ఎల్‌) జారీ చేసే గృహ రుణాలపై వడ్డీ రేట్లను పెంచింది. ఈ రంగం రుణాలపై మరో 35 బేసిస్‌ పాయింట్లు లేదా 0.35 శాతం పెంచినట్లు పేర్కొంది. దీంతో ఇకపై గృహ రుణాలపై కనీస వడ్డీ రేటు 8.65 శాతం నుంచి ప్రారంభం కానుందని ఆ సంస్థ వెల్లడించింది. సవరించిన రుణ రేట్లు సోమవారం నుంచే అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. ఇటీవల ఆర్‌బిఐ రెపో రేటును పెంచడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గత వారం హెచ్‌డిఎఫ్‌సి కూడా తన గృహ రుణాలపై 35 బేసిస్‌ పాయింట్లు పెంచింది.