హైదరాబాద్ : దేశీయ బీమా టెక్ కంపెనీ 'ఇన్సూరెన్స్ దేఖో' తొలిసారి భారీ నిధులను సమీకరించింది. ఈ సంస్థ సిరీస్ ఎ ఫండింగ్‌లో 150 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.1,240 కోట్ల)ను నిధులను సేకరించినట్లు ప్రకటించింది. ఈక్విటీ రౌండ్‌లో ముందంజలో ఉన్న గోల్డ్ మన్ శాక్స్ అసెట్ మేనేజ్‌మెంట్, టివిఎస్ క్యాపిటల్ ఫండ్స్, ఇన్వెస్ట్ కార్ప్, అవతార్ వెంచర్స్, లీప్ ప్రాగ్ ఇన్వెస్ట్ మెంట్స్ తదితర సంస్థలు నిధులు అందించిన వాటిలో ఉన్నాయి. 2016లో అంకిత్ అగర్వాల్, ఈష్ బబ్బర్ కలిసి ఇన్సూరెన్స్ దేఖోను ఏర్పాటు చేశారు. ప్రారంభించినప్పటి నుంచి ఈ కంపెనీ గణనీయమైన ప్రీమియం వృద్థిని నమోదు చేస్తుంది. 2023 మార్చి నాటికి వార్షిక ప్రీమియం రూ.3,500 కోట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఇన్సూరెన్స్ దేఖో సిఇఒ కోఫౌండర్ అంకిత్ అగర్వాల్ పేర్కొన్నారు.










