Jan 07,2023 15:00

ప్రజాశక్తి-కంచికచర్ల :  ప్రతి నెలా ఒకటో తారీఖున సూర్యోదయానికి ముందే లబ్దిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందని నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం కొత్తగా మంజూరైన వివిధ సామాజిక టెన్షన్లు ఆయన లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 60 లక్షల మందికి పైగా ఏటా 75 వేల కోట్ల పెన్షన్లకు ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. ప్రతి 6 నెలలకొకసారి కొత్తగా ఎంపికైన లబ్దిదారులకు పెన్షన్లు అందజేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం దశల వారీగా పెన్షన్లు పెంచుతూ 2 వేల రూపాయల పెన్షన్ ను మూడేళ్ల లో 2750 కి పెంచుతామన్నారు. వచ్ఛే ఏడాది మరో 250 పెంచి 3 వేలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి షేక్ బషీర్, వైస్ ఎంపిపి బండి మల్లిఖార్జన్ రావు, వెలగలేటి మాధవి, జడ్పీటీసీ వేల్పుల ప్రశాంతి, సర్పంచ్ లు వేల్పుల సునీత, బొక్కా రవికుమార్, యద్దనపూడి ఆనంద జ్యోత్స్న, ఉప సర్పంచ్ వేమా సురేష్ బాబు, నాయకులు గుదే రంగారావు, పరిటాల రాము, తంగెళ్ళమూడి రామారావు, బుడ్డి సత్యం, పాటిబండ్ల హరి జగన్నాథరావు, చింతా రవి,  తహశీల్దార్ వి రాజకుమారి, యంపీడీఓ కె బాల శంకరరావు, కార్యదర్శి కనగాల రవికుమార్ , యండి మీర్జావలి,  తదతరులు పాల్గొన్నారు.