ప్రజాశక్తి-కంచికచర్ల : కంచికచర్లలో గురువారం నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక నెహ్రూ సెంటర్, నంబూరు వారి వీధి, జుజ్జూరు రోడ్డులో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ అందజేస్తున్న సంక్షేమ పథకాల బుక్ లెట్స్ అందజేశారు. స్థానికంగా నెలకొన్న సమస్యల ప్రజలు ప్రస్తావించారు. పక్కా గృహం కోసం మూడు దఫాలుగా దరఖాస్తు చేసుకున్నా మంజూరు చేయలేదని, మాగోడు వినే నాధుడే లేడని మహిళలు ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.










