ప్రజాశక్తి-కంచికచర్ల : టిడిపి యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు సోమవారం కంచికచర్లలో ఘనంగా నిర్వహించారు. స్థానిక టిడిపి కార్యాలయంలో మండల టిడిపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లోకేష్ జన్మదిన కేక్ ను మండల టిడిపి అధ్యక్షుడు కోగంటి బాబు కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ మనువడిగా రాజకీయాల్లోకి వచ్చిన లోకేష్ పార్టీలో కార్యకర్తల సంక్షేమం కోసం చేసేసి కృషి ఎనలేనిదన్నారు. ఎమ్మెల్సీగా మంత్రిగా పనిచేసి, ఆ పదవులకే వన్నె తెచ్చాడని కొనియాడారు. త్వరలో లోకేష్ చేపట్టనున్న పాదయాత్ర విజయవంతం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి, పార్టీ బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి అల్లడి కోటేశ్వరరావు, నాయకులు గుత్తా రత్నం, ఓంకార్, వేమా వెంకట్రావు, అన్నదాత రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.










