ప్రజాశక్తి-కంచికచర్ల : కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా వీరులపాడు మండలం అల్లూరు గ్రామానికి చెందిన కోటేరు మల్లేశ్వరి, వైస్ చైర్మన్ గా కంచికచర్లకు చెందిన మాడుగుల శంకరరావు ఇతర పాలకవర్గ సభ్యులు శుక్రవారం స్థానిక మార్కెట్ యార్డులో ప్రమాణ స్వీకారం చేశారు. నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మార్కెట్ యార్డు కార్యదర్శి కె శ్రీనివాసరావు ఛైర్మన్, వైస్ చైర్మన్, ఇతర పాలక వర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఛైర్మన్ ఛాంబర్ లో ఛైర్మన్ కోటేరు మల్లేశ్వరిని కుర్చీలో కూర్చోబెట్టి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వీరులపాడు ఎంపిపి కోటేరు శ్రీ లక్ష్మీ, కంచికచర్ల వైస్ ఎంపిపిలు వెలగలేటి మాధవి, బండి మల్లిఖార్జన్ రావు, కంచికచర్ల, వీరులపాడు జడ్పీటీసీ లు వేల్పుల ప్రశాంతి, ఆమర్లపూడి కీర్తి సౌజన్య, మార్కెటింగ్ ఏడీ శ్రీనివాస్, నాయకులు కోటేరు ముత్తారెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, ఏఎంసీ మాజీ ఛైర్మన్లు బొమ్మిశెట్టి భాస్కరరావు, కాలవ పెదబాబు, వాసుదేవరావు, ఆగ్రో డైరెక్టర్ మంగునూరు కొండారెడ్డి, షేక్ కార్పోరేషన్ డైరెక్టర్ షేక్ షహనాజ్ బేగం, డీసియంయస్ డైరెక్టర్ బండి జానకి రామయ్య, నంబూరి పెదబాబు, ఆవుల రమేష్, సాయిబాబు, కంచికచర్ల సర్పంచ్ వేల్పుల సునీత, తదితరులు పాల్గొన్నారు.










