దేశభక్తి కలిగి ఉండి
దేశకీర్తి పెంచెదము
దేశమంటే మట్టి కాదని
మనుషులమని చాటెదము
సామ్యవాద భావనను
అందరమూ కలిగుందుము
దేశసంపదను పెంచి
అందరికీ పంచెదము
సమత మమత కలిగి మనం
సోదరులుగ కలిసుందుము
ప్రతి ఒక్కరు సైనికులై
ప్రగతి బాట నడిచెదము
శత్రువులను ఎదిరించి
ఐక్యతను చాటెదము
జగతిన మన దేశాన్ని
ఉన్నతంగా నిలుపుదుము
- రావిపల్లి వాసుదేవరావు,
94417 13136.










